చంద్రబాబుతో జేసీ సోదరుల భేటీ.. పవన్, అస్మిత్ లకు టికెట్ ఇవ్వడంపై చర్చ!
- కుమారులను రంగంలోకి దించుతున్న జేసీ బ్రదర్స్
- ఎన్నికల్లో తప్పుకుంటామని పరోక్ష సంకేతాలు
- ఉండవల్లిలో సీఎంతో కీలక మంతనాలు
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతీ చౌదరి, ఎమ్మెల్సీ శమంతకమణి తనయుడు అశోక్, మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరాం, నిమ్మల కిష్టప్ప తనయుడు శిరీశ్ తదితరులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోమని జేసీ సోదరులు గతంలో చాలాసార్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.