జల్లికట్టుకు రంగం సిద్ధం.. 2,600 ఎద్దులు, 3,400 మంది యువకులు!
- తమిళనాట ప్రారంభమైన పొంగల్ వేడుకలు
- జల్లికట్టుకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- తిలకించేందుకు తరలివచ్చిన ప్రజలు
ఇక, జల్లికట్టు అత్యంత వైభవంగా జరిగే అవనియపురం, పాలమేడు, అనంగానల్లురు తదితర ప్రాంతాల్లో పశువులను కట్టడి చేసే యువత సాహసాలను ప్రత్యక్షంగా తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు చేరుకున్నారు. ఈ సంవత్సరం జల్లికట్టులో 2,600 ఎద్దులు పాల్గొంటుండగా, వాటిని అదుపు చేసేందుకు తాము సిద్ధమని 3400 మంది యువకులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.