వాళ్లందరికీ క్షమాపణలు చెబుతున్నాను: యాంకర్ అనసూయ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాళ్లందరికీ క్షమాపణలు చెబుతున్నాను: యాంకర్ అనసూయ

  • 'రంగమ్మత్త'కి గాను తొలి అవార్డు
  • ఎంపిక చేసినవారికి థ్యాంక్స్  
  • ఆనందంలో మరిచిపోయాను
క్రితం ఏడాది అనసూయ చేసిన 'రంగస్థలం' సినిమా ఆమెకి విపరీతమైన క్రేజ్ ను తీసుకొచ్చింది. ఈ సినిమా తరువాత అనసూయను అంతా 'రంగమ్మత్త' అని పిలిచేంతలా ఆ పాత్ర పాప్యులర్ అయింది. ఈ పాత్రకిగాను 'జీ సినిమా అవార్డ్స్ 2018' వేడుకలో అవార్డును సొంతం చేసుకుంది. 'రంగమ్మత్త' పాత్రకి గాను తొలి అవార్డు 'జీ సినిమా అవార్డ్స్' వేదికపై అందుకున్న అనసూయ, ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించింది.

'జీ సినిమా అవార్డ్స్' నుంచి రంగమ్మత్త పాత్రకిగాను తొలి అవార్డు అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది. ఈ అవార్డుకిగాను నన్ను ఎంపిక చేసిన వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవార్డును గెలిచిన ఆనందంలో నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను. అప్పుడు నా స్పీచ్ పెద్ద డిజాస్టర్ అని నేను భావిస్తున్నాను. మైత్రీ మూవీ మేకర్స్ .. చరణ్ .. రత్నవేలు .. దేవిశ్రీ .. నా భర్త .. అమ్మానాన్నలకీ, 'రంగస్థలం' సిబ్బందికి థ్యాంక్స్ చెప్పడం మరిచిపోయాను. మీరంతా కూడా నా క్షమాపణలను అంగీకరించాలని కోరుతున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.
anasuya

More Telugu News