Uttar Pradesh: షెడ్డులోకి దూసుకెళ్లిన ట్రక్కు.. నలుగురు చిన్నారులు సహా ఏడుగురి మృతి

షార్ట్స్‌లో చూడండి
కొత్త సంవత్సరంలో జరిగిన పెను విషాదంలో ఏడుగురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి జిల్లాలో మంగళవారం పశువులను మోసుకెళుతున్న ట్రక్కు నేటి ఉదయం 5:30 గంటలకు మాల్దా గ్రామ సమీపంలోకి రాగానే షెడ్డులోకి దూసుకెళ్లింది.

ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. వీరిలో మూడు నుంచి ఎనిమిదేళ్ల వయసు గల నలుగురు చిన్నారులున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళను ఆసుపత్రిలో చేర్పించినట్టు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్పందించని కారణంగా ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు స్టేషన్ హౌజ్ అధికారులను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు.
Go Back to Shorts
Uttar Pradesh
Truck
Died
Police
Suspend

More Telugu News