స్పా ముసుగులో వ్యభిచారం.. నాచారంలో ముగ్గురు యువతుల అరెస్ట్
Add ap7am to your home Screen

స్పా ముసుగులో వ్యభిచారం.. నాచారంలో ముగ్గురు యువతుల అరెస్ట్

  • బయటకు స్పా.. లోపల వ్యభిచారం
  • దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు
  • విటులు, యువతులు, నిర్వాకుల అరెస్ట్
అదో స్పా సెంటర్. పేరు ఎస్సెన్స్. హైదరాబాద్‌లోని నాచారంలో ఉన్న ఇది పేరుకు స్పా అయినా లోపల జరుగుతున్న తంతు వేరు. గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తుండడంతో తాకిడి ఎక్కువగా ఉంటోంది. దీంతో అనుమానం వచ్చిన కొందరు ఇచ్చిన పక్కా సమాచారంతో ఆదివారం సాయంత్రం మెరుపు దాడి చేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు విస్తుపోయారు. లోపల యథేచ్ఛగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. స్పాపై దాడి చేసిన పోలీసులు ముగ్గురు యువతులు, ఇద్దరు విటులతోపాటు ముగ్గురు నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 8 వేల నగదు, 6 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న యువతుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Hyderabad
Nacharam
spa
prostitution
police
Telangana

More Telugu News