శామీర్ పేటలో అర్ధరాత్రి రేవ్ పార్టీ.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు!
- రేవ్ పార్టీలో ఏడుగురు వైద్యులు
- వీరంతా గజ్వేల్ కు చెందినవారే
- నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
దీంతో రంగంలోకి దిగిన ఎస్ వోటీ పోలీసులు.. రిసార్ట్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న ఏడుగురిని ఈరోజు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. వీరంతా వైద్యులే అని తెలిసి అధికారులు విస్తుపోయారు. ఈ సందర్భంగా నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని స్టేట్ హోంకు తరలించారు.
మరోవైపు నిందితులను ఈరోజు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. కాగా, రేవ్ పార్టీకి వచ్చిన యువతులకు హెచ్ఐవీ పరీక్షలు చేసిన కిట్లను పోలీసులు ఘటనాస్థలంలో స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొంటున్న వైద్యులంతా గజ్వేల్ కు చెందినవారని వ్యాఖ్యానించారు.