మద్దెలచెరువు సూరి హత్యకేసులో భానుకిరణ్ కు యావజ్జీవం!
- రూ.20 వేలు జరిమానా విధించిన నాంపల్లి కోర్టు
- నలుగురిని నిర్దోషులుగా విడుదల చేసిన న్యాయస్థానం
- 92 మంది సాక్షుల వాంగ్మూలాల స్వీకరణ
హైదరాబాద్ లోని యూసప్ గూడ ప్రాంతంలో 2011,జనవరి 4న సూరి కారులో ప్రయాణిస్తుండగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అనంతరం భానుకిరణ్ పారిపోవడంతో అతనిపై పోలీసులు కేసు నమోదుచేశారు. 2012లో భానుకిరణ్ ను జహీరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. ఏడేళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు 92 మంది సాక్షులను విచారించింది. సూరి డ్రైవర్ వాంగ్మూలం, భానుకిరణ్ వాడిన తుపాకీ, కాల్ డేటా ఆధారంగా కోర్టు భానును దోషిగా తేల్చింది.