chiranjeevi: మెగాఫ్యాన్స్ ముచ్చట తీర్చడం కోసమే .. చిరూ - కొరటాల మూవీలో గెస్టుగా చరణ్

షార్ట్స్‌లో చూడండి
ఒక వైపున చిరంజీవి కథానాయకుడిగా 'సైరా' సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. మరో వైపున చిరంజీవి .. కొరటాల కాంబినేషన్లోని సినిమాకి సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసిన కొరటాల, త్వరలో చిరంజీవికి వినిపించడానికి రెడీ అవుతున్నాడట. ఈ సినిమాలో చిరంజీవి పెద్దరికానికి తగినట్టుగానే ఆయన పాత్ర ఉంటుందని అంటున్నారు. రైతు పాత్రలో చిరంజీవిని చూపిస్తూ .. సామాజిక సందేశంతో ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో ఒక సందర్భంలో చరణ్ కూడా తెరపై మెరవనున్నాడని అంటున్నారు. చిరూ.. చరణ్ లతో మాట్లాడిన తరువాతనే కొరటాల ఆ సీన్ రాసుకున్నారని చెబుతున్నారు. గతంలో 'మగధీర' .. 'బ్రూస్లీ' సినిమాల్లో చరణ్ తో కలిసి చిరంజీవి అభిమానులకి ఆనందాన్ని కలిగించారు. ఈసారి చిరూతో కలిసి చరణ్ మెరిసి అభిమానుల ముచ్చట తీర్చనున్నాడన్న మాట. జనవరిలో ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. 
Go Back to Shorts
chiranjeevi
charan

More Telugu News