'యాత్ర' రిలీజ్ డేట్ ఖరారు .. మూడు భాషల్లో విడుదల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'యాత్ర' రిలీజ్ డేట్ ఖరారు .. మూడు భాషల్లో విడుదల

  • మహి వి.రాఘవ దర్శకత్వంలో 'యాత్ర'
  • వైఎస్ అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి 
  • ఫిబ్రవరి 8వ తేదీన భారీస్థాయి విడుదల
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రను 'యాత్ర' పేరుతో దర్శకుడు మహి వి.రాఘవ రూపొందిస్తున్నాడు. మమ్ముట్టి ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాను ఫిబ్రవరి 8వ తేదీన 3 భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయన చేపట్టిన పాదయాత్ర ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసి .. ఆయన విజయంలో కీలకమైన పాత్రను పోషించింది. ఆ విశేషాలన్నీ కూడా ఈ బయోపిక్ లో చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజల్లో వైఎస్ పట్లగల ఆదరాభిమానాల కారణంగా, ఈ సినిమాకి విశేషమైన స్పందన లభించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
mammootty

More Telugu News