తెలంగాణలో మంత్రులుగా పలువురు కొత్త వారికి చాన్స్... లైన్లో ఉన్నది వీరే!
- మంత్రులుగా కొత్త వారికి చాన్స్
- డిప్యూటీ రేస్ లో అరూరి రమేశ్, ఫరీదుద్దీన్
- కొత్త మంత్రుల్లో దానం, దాస్యం, ఎర్రబెల్లి, పువ్వాడ!
ఇక కొత్త మంత్రుల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీఎస్ రెడ్యానాయక్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లతో పాటు దానం నాగేందర్, దాస్యం విజయ్ భాస్కర్ తదితరులకు స్థానం దక్కవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రుల విషయమై ఇంకా ఎటువంటి స్పష్టతా రాలేదు. తాజా మాజీ ఉప ముఖ్యమంత్రులుగా కడియం శ్రీహరి, మహమూద్ అలీ ఉండగా, వారి స్థానంలో అరూరి రమేశ్, మహ్మమ్మద్ ఫరీదుద్దీన్ లు రావచ్చన్న ప్రచారం జరుగుతోంది. టీ పద్మారావుగౌడ్ ప్లేస్ లో కేపీ వివేకానంద్ గౌడ్, జోగు రామన్న స్థానంలో దానం నాగేందర్ పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.