అధికారులకు అంతుబట్టని రుద్రారం పోలింగ్ బూత్.. మిస్టరీగా మారిన ఓట్లు!
- ఉన్న ఓట్లకు, పోలైన ఓట్లకు మధ్య తేడా
- వీవీపాట్ స్లిప్పుల్లోనూ తేలని లెక్క
- కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
దీంతో ఇక్కడ అవకతవకలు జరిగినట్టు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి చంద్రశేఖర్ అదే రోజు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో 11న జరిగిన కౌంటింగ్‌లో ఈవీఎంలను పక్కనపెట్టి వీవీపాట్ స్లిప్పులను లెక్కించారు. అయితే, ఈసారి కూడా లెక్కల్లో తేడా వచ్చింది. 504 ఓట్లు మాత్రమే పోలైనట్టు తేలింది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉన్న ఓట్లకు, పోలైన ఓట్లకు, వీవీపాట్ స్లిప్పులకు మధ్య తేడా కనిపించడంతో ఇక్కడ బరిలో ఉన్న నేతలు కలెక్టర్‌కు మరోమారు ఫిర్యాదు చేశారు.