కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, డీకే అరుణ, షబ్బీర్ అలీ ఘోర పరాజయం!
- 16వేల ఓట్ల తేడాతో కోమటిరెడ్డి చిత్తు
- గంప గోవర్ధన్ చేతిలో షబ్బీర్ అలీ ఓటమి
- మూడు స్థానాల్లో గెలిచిన మజ్లిస్ పార్టీ
మరోవైపు కూకట్ పల్లిలో మాధవరం కృష్ణారావు 28,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. కాగా, ఏఐఎంఐఎం పార్టీ తాజాగా మరో రెండు స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. చార్మినార్ నుంచి ఏఐఎంఐఎం అభ్యర్థి అహ్మద్ ఖాన్ 32,317 మెజారిటీతో, బహదూర్ పురాలో మౌజంఖాన్ తమ సమీప ప్రత్యర్థులపై ఘనవిజయం సాధించారు. కాగా, మజ్లిస్ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణ గుట్ట నుంచి ఇప్పటికే 54 వేల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే.