భారత్-ఆసీస్ మధ్య దోబూచులాడుతున్న విజయం.. ఉత్కంఠగా తొలి టెస్ట్
- విజయానికి మూడు వికెట్ల దూరంలో భారత్
- ఆసీస్ విజయానికి 121 పరుగులు అవసరం
- అభిమానుల్లో ఉత్కంఠ
బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న కెప్టెన్ టిమ్ పైనే (41) ను లంచ్ తర్వాత బుమ్రా అవుట్ చేయడంతో భారత విజయం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత్ విజయానికి మూడు వికెట్లు అవసరం కాగా, ఆసీస్ విజయం సాధించాలంటే 121 పరుగులు అవసరం. టీమిండియా బౌలర్లలో బుమ్రా, అశ్విన్, షమీ చెరో రెండు వికెట్లు తీసుకోగా, ఇషాంత్ శర్మకు ఓ వికెట్ దక్కింది.