ఆయన ‘కాకా' వెంకట్రావు, కమీషన్ల రావు’: వైఎస్ జగన్ విమర్శలు
- ప్రజల కోసం కళా వెంకట్రావు ఒక్క మంచి పనీ చేయలా
- చంద్రబాబుని మాత్రం ఆయన బాగా కాకా పడతారు
- కోట్ల రూపాయల భూములను కొట్టేశారు
ప్రజల కోసం ఏ ఒక్క మంచి పనీ చేయని కళా వెంకట్రావు.. చంద్రబాబునాయుడిని మాత్రం బాగా కాకా పడతారని, కళా వెంకట్రావును కమీషన్ల రావు అని ప్రజలు అంటున్నారని, కోట్ల రూపాయల భూములను కొట్టేశారని ఆరోపించారు. నాడు వైఎస్ హయాంలో ఇక్కడ అంబేద్కర్ యూనివర్శిటీ వచ్చిందని, ఈ యూనివర్శిటీలో పోస్టులు భర్తీ చేయరని, 16 మంది అధ్యాపకులకుగాను 12 మందే ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఈ ఒక్క నియోజకవర్గంలోనే 34 ప్రభుత్వ పాఠశాలలను మూసేయించారని ప్రజలు చెబుతున్నారని అన్నారు.