kcr: కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన సీపీఐ నారాయణ

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని పెద్ద నాయకుడిగా మార్చారని, ఆయన గెలుపుని మరింత సులువు చేశారని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ 12 స్థానాల్లో, సీపీఐ 3 స్థానాల్లో గెలుస్తాయని చెప్పారు. తెలంగాణ భవిష్యత్తు కోసమే మహాకూటమి ఏర్పడిందని తెలిపారు.

ఒక కాంట్రాక్టు ప్రకారం బీజేపీ, టీఆర్ఎస్ లు తిట్టుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలో గెలిచే విధంగానే దేశం మొత్తం గెలుస్తామని చెప్పారు. ఏపీలో వేలు పెడతామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... బ్లాక్ మెయిల్ చేయకుండా, ఏపీలో పార్టీ పెట్టి గెలవాలని అన్నారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు అప్పనంగా భూములు అప్పగించారని... వీటిపై చట్టపరంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. 
Go Back to Shorts
kcr
narayana
Revanth Reddy
cpi
congress
TRS

More Telugu News