ప్రేమించి పెళ్లాడాడు.. నమ్మి వెంట వస్తే వ్యభిచార కూపంలోకి దింపాడు!
- ఢిల్లీ యువతిని నమ్మించి మోసం
- విటుల్లా వెళ్లి ఆట కట్టించిన పోలీసులు
- పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ఓరోజు ఆమెను విజయనగరం తీసుకొచ్చి మరో ఇద్దరు మహిళలు ఉన్న ఇంట్లో పెట్టాడు. ఆ ఇద్దరు తన బంధువులని ఆమెను నమ్మించాడు. కొన్నాళ్లకు మరో అమ్మాయిని తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ యువతిని శారీరకంగా లొంగదీసుకున్న నిందితుడు, పెళ్లి చేసుకుంటానని, కాకపోతే తాను చెప్పినట్టు చేసి డబ్బులు సంపాదించాలని వేధించడం మొదలుపెట్టాడు.
చక్రధర్ బారి నుంచి తప్పించుకునే మార్గం లేక అతడు పెట్టే బాధలు భరించిన యువతి ఈ నెల 3న ఎలాగోలా తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు బయలుదేరింది. అయితే, మార్గమధ్యంలో స్పృహ తప్పి పడిపోవడంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మారువేషంలో విటుల్లా వెళ్లి నిందితుడు చక్రధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.