లాలు ప్రసాద్‌లా జగన్ జైలు ఊచలు లెక్కపెట్టుకోవడం ఖాయం: పవన్
- జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి యువతకు దిశానిర్దేశం చేస్తారా?
- పాపాలు చేశారు కాబట్టే వారికి మోదీ అంటే భయం
- నాకెందుకు భయం.. చంపేస్తారా?
తాను ఏ ఉద్దేశంతో చంద్రబాబుకు మద్దతు ఇచ్చానో ఇప్పుడది నెరవేరడం లేదన్నారు. అవినీతి రహిత పాలన అందించాలని, రాజధాని రైతులను ఇబ్బంది పెట్టొద్దని చంద్రబాబును కోరానన్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. పాపాలు చేశారు కాబట్టే చంద్రబాబు, జగన్‌లకు మోదీ అంటే భయమని, తనకు ఎటువంటి భయాలు లేవన్నారు. చంపేస్తామన్నా తాను బెదిరేదిలేదని పవన్ స్పష్టం చేశారు.