Chandrababu: చంద్రబాబు ఇక్కడ ప్రభుత్వం స్థాపిస్తాడా? ఆరుస్తాడా? తీరుస్తాడా?: కేసీఆర్ ఫైర్

షార్ట్స్‌లో చూడండి
తాను హైదరాబాద్ కు చెందిన వాడిని కాదని, పాత మెదక్ జిల్లా నుంచి వచ్చిన వాడినని, తనలాగే  చాలా మంది చాలా చోట్ల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారని, సంతోషంగా జీవిస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ,
‘ఇక్కడ చంద్రబాబుకు ఏం అవసరం? ఆయనకు రాష్ట్రం లేదా? ఇక్కడికొచ్చి పోటీ చేసే స్థానాలు ఎన్ని? పదమూడు స్థానాలు. ప్రభుత్వం స్థాపిస్తాడా? ఆరుస్తాడా? తీరుస్తాడా? ఏం చేస్తాడు?

నగరంలో ఉండే విజ్ఞులు.. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతీయులు, రాయలసీమ ప్రాంతీయులు ఆలోచించాలని నేను కోరుతున్నా. కుటిలం, కుళ్లు కాకపోతే ఏ రాజకీయాలు ఆశించి ఆయన వస్తున్నాడు? తెలుగు ప్రజల మీద ప్రేమ ఉంటే ఇక్కడికొచ్చి చిచ్చు పెట్టాలా? ప్రశాంతంగా బతికే ప్రజలను విడదీయాలా? హ్యాపీగా ఉన్న వాళ్ల మధ్య పంచాయతీలు పెట్టాల్నా? ఏం అవసరం?  దేని కోసం వస్తున్నారు? విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని మనవి చేస్తున్నా’ అని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
kcr
TRS
Telugudesam
Hyderabad

More Telugu News