JC: సాయిరెడ్డిని పంపించి రూ. 30 కోట్లు అడిగించిన జగన్... జేసీ సంచలన కామెంట్స్... వీడియో!

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని, తన ప్రధాన అనుచరుల్లో ఒకరైన ఓ కాంట్రాక్టరును పంపించిన జగన్, తనకు టికెట్ ఇచ్చేందుకు రూ. 30 కోట్లను అడిగారని జేసీ దివాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఓ వెబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తాను ఆ డబ్బిచ్చేందుకు అంగీకరించలేదని అన్నారు.

2014 ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటనను గుర్తు చేసుకున్న జేసీ, "నేనన్నాను... వాళ్ల తాత నాకు తెలుసు. వాళ్ల నాయిన నాకు తెలుసు. నేను పుట్టడంతోటే సిల్వర్ స్పూన్ తో పుట్టాను. వాళ్ల తాతకన్నా మా తాత చానా చానా భూస్వాములు, పెద్ద రెడ్లు. నా కంటే వీడు పెద్దోడా? నేను కప్పం కట్టడానికి. ఐయామ్ నాట్ రెడీ టూ పే ది కప్పం" అని వ్యాఖ్యానించారు. ఆ వీడియోను మీరూ చూడండి.
Go Back to Shorts
JC
Jagan
Vijayasai Reddy

More Telugu News