జగన్ చొక్కాను ఫోరెన్సిక్ పరీక్షలకు ఇవ్వొద్దు.. కోర్టును ఆశ్రయించిన జగన్ న్యాయవాది!
- జగన్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు
- డిసెంబర్ 3కు ఆ పిటిషన్ వాయిదా పడింది
- విశాఖ కోర్టుకు తెలిపిన నీలాపు కాళీదాసురెడ్డి
దీంతో జగన్ న్యాయవాది నీలాపు కాళీదాసురెడ్డి కౌంటర్ మెమో దాఖలుచేశారు. జగన్ హైకోర్టులో దాఖలుచేసిన రిట్ పిటిషన్ ఈ నెల 27న విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ డిసెంబర్ 3కు వాయిదా పడిందని గుర్తుచేశారు. హైకోర్టులో ఈ వ్యవహారం తేలేవరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేశారు.