కేసీఆర్ కు ఇక్కడి జైళ్లు సరిపోవు.. అండమాన్ జైల్లో పెట్టాలి: రేవంత్ రెడ్డి
- మందుపోసుకొచ్చి మాట్లాడే కేసీఆర్.. చంద్రబాబుపై మూడో కన్ను తెరుస్తారట
- తాగి రాష్ట్రాన్ని నడిపే వ్యక్తిని ఎలా భరించాలి
- కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే.. లక్ష ఉద్యోగాలు ఇస్తాం
తెలంగాణ వస్తే సమ్మక్క సారక్కకు మొక్కు చెల్లిస్తానని చెప్పిన కేసీఆర్... సమ్మక్క జాతరకు ఎందుకు రాలేదని రేవంత్ ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల ఊబిలోకి కేసీఆర్ నెట్టేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఒక్కడి ఉద్యోగం ఊడగొడితే 100 రోజుల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. బ్యాంకులకు ఒక్క రూపాయి అప్పుకూడా కట్టకండని... మహాకూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని తెలిపారు. నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలని... సుపరిపాలన అందించే కూటమిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. పోడు భూముల సమస్య సీతక్క ద్వారా తీరబోతోందని అన్నారు. నీరు, నిధులు, నియామకాలు అని చెప్పిన వారు ఎన్ని నీళ్లు తెచ్చారో? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో? చెప్పాలని డిమాండ్ చేశారు.