మహిళా హోంగార్డుపై అత్యాచారం చేసిన కానిస్టేబుల్

  • బెంగళూరు యూనివర్శిటీ క్యాంపస్ లో పని చేస్తున్న బాధితురాలు
  • అక్కడే పని చేస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్
  • రాత్రి బాధితురాలు ఇంటికి వెళ్లి అత్యాచారం
మహిళలకు రక్షణగా నిలవాల్సిన ఓ కానిస్టేబుల్... విచక్షణ మరిచి తన సహ ఉద్యోగిపైనే అత్యాచారం చేసిన దారుణ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, బెంగళూరు యూనివర్శిటీ క్యాంపస్ లో వివాహిత అయిన ఓ మహిళా హోంగార్డు విధులను నిర్వహిస్తోంది. అక్కడే పని చేస్తున్న చంద్రశేఖర్ అనే కానిస్టేబుల్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. విధులను పూర్తి చేసుకున్న బాధితురాలు రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకుని... యూనిఫాం మార్చుకుంటుండగా చంద్రశేఖర్ వచ్చి తలుపు తట్టాడు. తన భర్త వచ్చాడనుకుని ఆమె తలుపు తీసింది.

లోపలకు వచ్చిన చంద్రశేఖర్ ఆమె వద్దని వేడుకుంటున్నా... ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. అనంతరం గదిలో కొంత డబ్బు వెదజల్లి పారిపోయాడు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. చంద్రశేఖర్ పై కేసు నమోదు చేశామని... దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ తెలిపారు.
Go Back to Shorts
bengaluru
wome
home guard
constable
rape
bengalore university

More Telugu News