సైన్స్ ఫిక్షన్ కోసం రెడీ అవుతోన్న రవితేజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సైన్స్ ఫిక్షన్ కోసం రెడీ అవుతోన్న రవితేజ

  • వీఐ ఆనంద్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ 
  • రవితేజ ద్విపాత్రాభినయం 
  • నాయికలుగా నాభా నటేశ్ .. పాయల్ 
'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాతో ఇటీవలే ప్రేక్షకులను పలకరించిన రవితేజ, తన తదుపరి సినిమాను వీఐ ఆనంద్ దర్శకత్వంలో చేయనున్నాడు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'.. 'ఒక్కక్షణం' వంటి వైవిధ్యభరితమైన సినిమాలను వీఐ ఆనంద్ తెరకెక్కించాడు. కంటెంట్ పరంగా ఈ సినిమాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.

ఇప్పుడు రవితేజ కథానాయకుడిగా ఒక సినిమాను రూపొందించడానికి వీఐ ఆనంద్ రెడీ అవుతున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ గ్రాఫిక్స్ తో ఈ కథ కొనసాగుతుంది. రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్న ఈ సినిమాలో నాభా నటేశ్ .. పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా కనిపించనున్నారు. కీలకమైన ఒక పాత్ర కోసం మరో హీరోయిన్ ను తీసుకోనున్నట్టుగా సమాచారం. ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. అదే రోజున ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.   
raviteja
aanand

More Telugu News