mammootty: 'యాత్ర' విడుదల తేదీ వాయిదా?

షార్ట్స్‌లో చూడండి
దర్శకుడు మహి. వి రాఘవ్ .. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను 'యాత్ర' పేరుతో రూపొందించాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని రాజకీయ మలుపులు .. ఆయన కొనసాగించిన పాదయాత్ర .. ప్రజలను ప్రభావితం చేసిన తీరు .. విజయాన్ని సొంతం చేసుకున్న విధానం ఈ సినిమాలో చూపించనున్నారట.

 మమ్ముట్టి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, డిసెంబర్ 21వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే అదే రోజున 'పడి పడి లేచే మనసు' .. 'అంతరిక్షం' .. 'కేజీఎఫ్' ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. పోటీ ఎక్కువగా ఉండటం వలన, 'యాత్ర'ను జనవరికి వాయిదా వేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవలసి ఉంటుంది.  
Go Back to Shorts
mammootty

More Telugu News