taapsee: పారితోషికాల విషయంలో స్పందించిన తాప్సీ

షార్ట్స్‌లో చూడండి
ఏ చిత్రపరిశ్రమలోనైనా హీరోలకంటే హీరోయిన్స్ కి పారితోషికాలు తక్కువగా ఉంటాయి. అయితే కొంతమంది హీరోయిన్స్, హీరోలతో సమానంగా తమకి పారితోషికాలు ఇవ్వవలసిందేనంటూ తమ గళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇకనైనా హీరోయిన్స్ పారితోషికాల విషయంలో మార్పు రావాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై తాప్సీ స్పందిస్తూ .. " హీరోలతో సమానమైన పారితోషికం హీరోయిన్స్ కి కూడా ఇవ్వాలని అడగడం కరెక్ట్ కాదు" అంది.

"నేను కొంతమంది స్టార్ హీరోల సరసన కథానాయికగా చేశాను. అలాగని చెప్పేసి వాళ్లకి ఇచ్చేంత పారితోషికం నాకు ఇవ్వవలసిందేనని నేను అడగలేను. ఎందుకంటే వాళ్ల మాదిరిగా థియేటర్స్ కి ఆడియన్స్ ను రప్పించే శక్తి నాకు లేదు. ఎవరి మార్కెట్ ను బట్టి .. క్రేజ్ ను బట్టి వాళ్లకి పారితోషికాలు ఉంటాయి. ఈ విషయంలో ఇతరులతో పోల్చుకోకుండా ఎవరి స్థాయికి తగిన పారితోషికాలు వాళ్లు తీసుకోవడమే మంచిది" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 
Go Back to Shorts
taapsee

More Telugu News