జీఎస్ఎల్వీ మార్క్- 3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది: ఇస్రో చైర్మన్ శివన్
- జీశాట్ సిరీస్ లో రెండో ప్రయోగం విజయవంతం
- వాహక నౌక 16 నిమిషాల్లో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది
- జనవరిలో చంద్రయాన్ ప్రయోగం ఉంటుంది
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీశాట్ సిరీస్ లో రెండో ప్రయోగం విజయవంతమైందని, భారత్ నుంచి ప్రయోగించిన భారీ ఉపగ్రహం జీశాట్-29 అని పేర్కొన్నారు. జీశాట్-29 ని వాహక నౌక 16 నిమిషాల్లో కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని అన్నారు. 2019 జనవరిలో చంద్రయాన్ ప్రయోగం ఉంటుందని ఈ సందర్భంగా శివన్ తెలిపారు.
కాగా, జీశాట్ సిరీస్ లో మూడు ఉపగ్రహాలను పంపాల్సి ఉండగా ఇప్పటికే రెండింటిని పంపారు. జీ శాట్-19 ఉపగ్రహాన్ని 2017లో పంపగా, జీ శాట్-29ను ఈ రోజు విజయవంతంగా ప్రయోగించారు. మరో ఉగపగ్రహం జీశాట్-11 ను డిసెంబర్ 4న యూరోపియన్ స్పేస్ పోర్టు నుంచి నింగిలోకి పంపనున్నారు.