నాకు కూడా ఒక ఆవును ఇస్తారా?.. పవిత్రంగా పెంచుకుంటా: బీజేపీని ఉద్దేశించి ఒవైసీ

  • లక్ష ఆవులను పంపిణీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు
  • నాక్కూడా ఒక ఆవును ఇవ్వండి
  • నవ్వుకునే అంశం కాదు.. సీరియస్ గానే అడుగుతున్నా
రాష్ట్రంలో లక్ష ఆవులను పంపిణీ చేస్తామని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తనకు కూడా ఒక గోవును ఇస్తారా? అని ఆయన అడిగారు. తనకు ఇచ్చే గోవును తాను అత్యంత పవిత్రంగా పెంచుకుంటానని చెప్పారు. అయితే, తనకు ఇస్తారా? లేదా? అనేదే ప్రశ్న అని అన్నారు. ఇది నవ్వుకునే అంశం కాదని... తాను సీరియస్ గానే అడుగుతున్నానని... ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో తాము టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్టు ఒవైసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దమ్ముంటే హైదరాబాదు నుంచి పోటీ చేసి గెలవాలని మోదీ, అమిత్ షాలకు ఆయన ఇప్పటికే సవాల్ విసిరారు. 
Go Back to Shorts
cow
owaisi
bjp
mim
manifesto

More Telugu News