ఏపీలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే చంద్రబాబు చిత్తుగా ఓడిపోతారు: హరీశ్ రావు జోస్యం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే చంద్రబాబు చిత్తుగా ఓడిపోతారు: హరీశ్ రావు జోస్యం

  • చంద్రబాబు చెప్పింది చేయడు..చేసింది మాట్లాడడు
  • అప్పుడు ఇటలీ దెయ్యమా.. ఇప్పుడేమో దేవతా!
  • చంద్రబాబు ప్రతీ అడుగు, మాటలు.. అంతా మోసమే
ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కనుక చంద్రబాబునాయుడు చిత్తుగా ఓడిపోతారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు జోస్యం చెప్పారు. సిద్ధిపేటలో హరీశ్ రావు మాట్లాడుతూ, చంద్రబాబు ప్రతీ అడుగు, మాటలు.. అంతా మోసమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చెప్పింది చేయడని, చేసింది మాట్లాడడు అని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీని ‘ఇటలీ దెయ్యం’ అన్న చంద్రబాబుకు ఇప్పుడు ఆమె దేవత అయిందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అవకాశవాది అని, టీఆర్ఎస్ ను ఎదుర్కోలేక అందరూ ఒకటయ్యారని దుమ్మెత్తిపోశారు. కేసీఆర్ ను నమ్ముతారా? నక్కజిత్తుల చంద్రబాబును నమ్ముతారా? అని ప్రజలను ప్రశ్నించారు. జెండా, అజెండా లేని మహాకూటమికి కావాల్సింది అధికారమే తప్ప ప్రజల సంక్షేమం కాదని విమర్శించారు.
Chandrababu
harish rao
Andhra Pradesh
Telangana

More Telugu News