ఎన్టీఆర్ కు పొడిచిన వెన్నుపోటే... రేపు రాహుల్ కు కూడా పొడుస్తారు!: చంద్రబాబుపై అసదుద్దీన్ సెటైర్
- రేపు రాహుల్ గాంధీకీ అదే గతి
- ఈ దోస్తీని ప్రజలు నమ్మరు
- కూటమితో కలిసే ప్రసక్తే లేదన్న అసదుద్దీన్
తాను అధికారంలో ఉండేందుకు చంద్రబాబు ఏమైనా చేస్తారని, అది ఆయన గుణమని చెప్పిన అసదుద్దీన్, నాడు ఎన్టీఆర్ కు ఏ గతి పట్టిందో నేడు రాహుల్ కు అదే గతి పట్టనుందని జోస్యం చెప్పారు. చంద్రబాబుతో కలిసుండే పార్టీలతో, కూటమితో తాము సంబంధాలు కలుపుకునే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు.