Congress: తెలుగు తమ్ముళ్ల పౌరుషం, రోషం ఏమైంది?: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కాంగ్రెస్- టీడీపీ పొత్తుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ, ఆ పార్టీతో చేతులు కలపడమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఏ సిద్ధాంతంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారో, ఆ సిద్ధాంతానికి చంద్రబాబు తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు.

‘తెలుగు తమ్ముళ్ళ రోషం, పౌరుషం ఏమైంది? మీ ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌ ఆత్మ ఘోష వినపడలేదా? నాడు వెన్నుపోటు పొడిచిన బాబు నేడు ఆయనను ఆత్మక్షోభకు గురిచేస్తే తిరగబడరా? ఏ సిద్ధాంతంతో ఎన్టీఆర్ పార్టీ పెట్టారో దానిని చంద్రబాబు కాంగ్రెస్ కాళ్ళ దగ్గర పెట్టి కళ్ళకద్దుకుంటుంటే మీ రక్తం మరిగిపోవటం లేదా?’ అని విజయసాయి తన ట్వీట్ లో ప్రశ్నించారు.
Go Back to Shorts
Congress
Telugudesam
YSRCP
vijayasai reddy

More Telugu News