asghar: 14 మందిని పొట్టనపెట్టుకున్న పులిని కాల్చి చంపిన హైదరాబాదీ!

షార్ట్స్‌లో చూడండి
ఏడాది కాలంగా మహారాష్ట్రలోని యావత్ మాల్ జిల్లా పాండ్రకోడ అడవుల్లోని 13 గ్రామాలను వణికిస్తున్న ఆడపులి ఎట్టకేలకు అంతమైంది. హైదరాబాద్ కు చెందిన అస్ఘర్ (35) నిన్న రాత్రి 11 గంటలకు పులిని కాల్చి చంపాడు. షూటర్ నవాబ్ షఫత్ అలీఖాన్ కుమారుడే అస్ఘర్. ఈ పులి 14 మందిని పొట్టనపెట్టుకుంది. దీంతో, గత రెండు నెలలుగా పులిని వేటాడే కార్యక్రమం కొనసాగుతోంది.

మొత్తం 200 మంది ఆ పులి కోసం గాలించారు. 112 కెమెరా ట్రాప్ లు, పారాగ్లైడర్లు, జాగిలాలు, థర్మల్ డ్రోన్లతో పులి ఆచూకీ కోసం గాలింపు జరిపారు. ప్రయత్నాలు చివరకు ఫలించాయి. అస్ఘర్ తూటాలకు పులి ప్రాణాలు వదిలింది. కోర్టు ఆదేశాలతోనే పులిని చంపడం గమనార్హం. మానవ రక్తానికి అలవాటు పడ్డ పులిని చంపేయడంతో, 13 గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ మొత్తం ఆపరేషన్ కు దాదాపు రూ. 70 లక్షలు ఖర్చు చేశారు.
Go Back to Shorts
asghar
tiger
Maharashtra

More Telugu News