సూర్య అభిమానుల్లో పెరుగుతోన్న అసహనం
- సూర్య 36వ సినిమాగా 'ఎన్జీకే'
- ముగింపు దశలో షూటింగ్
- దీపావళి కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
తన 36వ సినిమాగా సూర్య చేస్తోన్న ఈ చిత్రంలో కథానాయికలుగా రకుల్ .. సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగు మొదలైన దగ్గర నుంచి టైటిల్ పోస్టర్ తప్ప ఇంతవరకూ ఎలాంటి అప్డేట్ అభిమానుల ముందుకు రాలేదు. దాంతో సూర్య అభిమానులంతా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీపావళికి ఈ సినిమా నుంచి టీజర్ వదిలితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల ముచ్చటను సూర్య తీరుస్తాడేమో చూడాలి మరి.