mega: మెగా ఫ్యామిలీలో 'హాలోవీన్' సందడి!

షార్ట్స్‌లో చూడండి
ఏ పండుగ అయినా, ఏ కార్యక్రమమైనా మెగా ఫ్యామిలీ మొత్తం ఒక చోట చేరి సందడి చేయడం అందరికీ తెలిసిందే. తాజాగా మెగా కుటుంబం మొత్తం కలసి హాలోవీన్ పండుగ చేసుకున్నారు. అందరూ దెయ్యాల మాదిరి మేకప్, డ్రెస్సింగ్ వేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఉపాసన, నిహారిక, సాయి ధరమ్ తేజ్, సుష్మిత ఇలా అందరూ కలసి సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో హాలోవీన్ పండుగను జరుపుకోవడం ఎప్పటి నుంచో ఆనవాయతీగా వస్తోంది. ఇప్పుడిప్పుడే ఈ కల్చర్ మన దేశంలో కూడా విస్తరిస్తోంది.
Go Back to Shorts
mega
family
halloween
chiranjeevi

More Telugu News