వైఎస్ జగన్ పై హత్యాయత్నం.. ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు!
- గిడ్ల చైతన్య, విజయలక్ష్మి కస్టడీలోకి
- మరింత లోతుగా విచారిస్తున్న అధికారులు
- విశాఖకు తరలించిన సిట్ బృందం
జగన్, శ్రీనివాసరావులు ఉన్న ప్లెక్సీల ఏర్పాటులో చైతన్య కీలక పాత్ర పోషించారు. తాజాగా శ్రీనివాసరావు జగన్ హత్యకు కుట్ర పన్నినట్లు వీరికి ముందుగానే తెలుసా? ఎన్నిరోజులు ప్లాన్ చేశారు? ఇంకా ఎవరెవరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు? అనే కోణంలో అధికారులు నిందితులను విచారించనున్నారు.