Rahul Gandhi: ప్రధాని మోదీ ఈ దేశాన్ని మోసం చేస్తున్నారు: రాహుల్ గాంధీ

షార్ట్స్‌లో చూడండి
దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో అంతర్గత కుమ్ములాటలు, అనంతర పరిణామాల నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శించారు. ప్రధాని మోదీ ఈ దేశాన్ని మోసం చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. మోదీ నిజానికి దూరంగా పారిపోవచ్చు కానీ నిజాన్ని దాచలేరని, సీబీఐ డైరెక్టర్‌ను మార్చినంత మాత్రాన పని జరగదన్నారు. ప్రధాని ఏం చేశారో దేశ ప్రజలు తెలుసుకుంటారన్నారు. తనను ఎన్నిసార్లైనా అరెస్టు చెయ్యెచ్చు కానీ నిజాన్ని దాచలేరని, వాస్తవాలు తప్పకుండా బయటకొస్తాయని పేర్కొన్నారు.

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అక్కడి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాహుల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు లోధి రోడ్డు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Rahul Gandhi
Congress

More Telugu News