ఒబామా, హిల్లరీ ఇళ్లకు కొరియర్ లో పేలుడు పదార్థాలు... ముందే తెలుసుకుని పేల్చేసిన సీక్రెట్ సర్వీస్!
- పార్శిల్ బాంబులతో తీవ్ర కలకలం
- ముందస్తు తనిఖీల్లో గుర్తించిన సీక్రెట్ సర్వీస్ అధికారులు
- సీఎన్ఎన్, న్యూయార్క్ కార్యాలయంలో కూడా!
ఇదిలావుండగా, సీఎన్ఎన్ వార్తాసంస్థ బిల్డింగ్ కు అనుమానాస్పద పార్శిల్ రావడంతో న్యూయార్క్ లోని బ్యూరో భవనాన్ని ఖాళీ చేయించి, బాంబ్ స్క్వాడ్, ఎఫ్బీఐలకి సమాచారం ఇచ్చారు. ముందు జాగ్రత్తగా ప్రపంచంలోని అన్ని సీఎన్ఎన్ కార్యాలయాల్లో తనిఖీలు చేయించినట్టు సంస్థ ప్రెసిడెంట్ జెఫ్ జుకర్ తెలిపారు. కాగా, ఈ ఘటనపై యూఎస్ఎస్ ఎంక్వయిరీ ప్రారంభించింది. విషయం తెలుసుకున్న వైట్ హౌస్, ఈ దాడి యత్నాలను ఖండించింది. పేలుడు పదార్థాలు బయటపడటంపై ట్రంప్ కు సమాచారం అందిందని, ఈ తరహా ఘటనలకు బాధ్యులైన వారిని శిక్షిస్తామని పేర్కొంది.