చంద్రబాబు అవినీతి రాహుల్ గాంధీకి కనిపించడం లేదు: వినోద్
- ప్రాంతీయ పార్టీలను బీజేపీ, కాంగ్రెస్ లు అణగదొక్కుతున్నాయి
- తెలంగాణలో గెలిచేది టీఆర్ఎస్సే
- కేంద్రంలో కూడా చక్రం తిప్పుతాం
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని... బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో కలసి జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పుతుందని అన్నారు. ప్రాంతీయ పార్టీలు ఎదగకుండా రెండు పార్టీలు యత్నిస్తున్నాయని... రెండు పార్టీల్లో ఎవరో ఒకరు కేంద్రంలో అధికారంలో ఉండాలనే ధోరణితో ముందుకు సాగుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో ఈ రెండు పార్టీల పప్పులు ఉడకవని... తెలంగాణ బిడ్డల పార్టీ టీఆర్ఎస్సే అని చెప్పారు. టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.