నేను నటించని సినిమాకొచ్చిన నకిలీ ‘ఆస్కార్’ ఇది: విరాట్ కోహ్లీ చమత్కారం
- ఓ సినిమాలో నటిస్తున్నానని గతంలో కోహ్లీ సరదా ట్వీట్
- అదంతా అబద్ధమేనంటూ తాజా ట్వీట్
- నేను నటించని ట్రైలర్ సినిమాను చూడని ప్రేక్షకులకు ధన్యవాదాలు
ఇది, నిజమేనని నమ్మిన అభిమానులు ఆశ్చర్యపడటమే కాకుండా సంతోషమూ వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఈ ట్వీట్ గురించి కోహ్లీ ప్రస్తావిస్తూ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసి అభిమానులను మళ్లీ ఆశ్చర్యపడేలా చేశాడు. ‘నేను నటించని ట్రైలర్ సినిమాకు వచ్చిన నకిలీ ‘ఆస్కార్’ ఇది. ఈ సినిమాను నిర్మించని వ్రాన్ ప్రొడక్షన్ కు, ఈ చిత్రాన్ని చూడని ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది ఫేక్ చిత్రం కనుక ఇది ఫేక్ ‘ఆస్కార్’’ అని ఆ వీడియోలో కోహ్లీ అసలు విషయం చెప్పేశాడు.