చైనాపై గతంలో ఎన్నడూ లేనంతగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటాం: ట్రంప్
- చైనా వల్ల బిలియన్ల మేర ద్రవ్యలోటు ఏర్పడుతోంది
- ద్రవ్యలోటును పూడ్చుకోవడానికే సుంకాలను పెంచుతున్నాం
- సుంకాలను పెంచడం వల్లే స్టీల్ ఇండస్ట్రీ తిరిగి పుంజుకుంటోంది
అణు సాంకేతిక వాణిజ్యంలో కూడా చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా తాజాగా ప్రకటించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, అమెరికన్లకు ఉద్యోగాలను కల్పించేందుకు తమ యంత్రాంగం తగిన చర్యలను చేపడుతుందని ట్రంప్ తెలిపారు. స్టీల్ పై సుంకాలను పెంచడం వల్లే అమెరికా స్టీల్ ఇండస్ట్రీ, ఒహిమో స్టీల్ ప్లాంట్ తిరిగి పుంజుకుంటున్నాయని చెప్పారు.