'అరవింద సమేత' సూపర్ హిట్టంటూ అభిమానుల సంబరాలు... స్క్రీన్ షాట్లతో హోరెత్తుతున్న సోషల్ మీడియా!
- ఈ ఉదయం విడుదలైన 'అరవింద సమేత'
- పాజిటివ్ రివ్యూలను ఇస్తున్న క్రిటిక్స్
- 'సింహాద్రి'ని మించిపోయిందంటున్న ఫ్యాన్స్
సినిమాలో వినోదం కొంత తక్కువైందని, అక్కడక్కడా హింస ఎక్కువగా ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నా, ఈ సినిమా ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ 'సింహాద్రి'ని మించిపోయిందని, 'జై లవకుశ' తరువాత ఎన్టీఆర్ కు మరో హిట్ ను అందించిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ చిత్రంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి తన సత్తాను చాటాడని అంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ట్వీట్లను మీరూ చూడవచ్చు.