మరోమారు భేటీ కానున్న ట్రంప్-కిమ్
Add ap7am to your home Screen

మరోమారు భేటీ కానున్న ట్రంప్-కిమ్

  • మరోమారు భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి
  • ఈ భేటీ నిమిత్తం నాలుగు ప్రదేశాలు పరిశీలిస్తున్నాం
  • యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గత జూన్ లో సింగపూర్ లో ఓమారు భేటీ అయిన విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి వీరు భేటీ కానున్నారు. ఈరోజు మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ, కిమ్ తో మరోమారు భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ భేటీ నిమిత్తం నాలుగు ప్రదేశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. పరిస్థితులను అనుసరించి ఉత్తరకొరియా లేదా అమెరికాలో ఈ భేటీ జరిగే అవకాశాలు లేకపోలేదని అన్నారు. కాగా, సింగపూర్ లోని కేపెల్లా హోటల్‌ లో గత జూన్ 12వ తేదీన వీరి తొలి సమావేశం జరిగింది..  నాడు వీరు జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి.
Donald Trump

More Telugu News