బెంబేలెత్తించిన భారత బౌలర్లు.. కుప్పకూలిన విండీస్ బ్యాటింగ్ లైనప్
- ముగిసిన రెండో రోజు ఆట
- 6 వికెట్లకు 94 పరుగులు చేసిన విండీస్
- విండీస్ ను ఆదిలోనే దెబ్బతీసిన షమీ
విండీస్ ఇన్నింగ్స్ ను ఆదిలోనే మొహమ్మద్ షమీ దెబ్బతీశాడు. 2 పరుగుల వద్ద ఓపెనర్ బ్రాత్ వైట్ ను, 7 పరుగుల వద్ద మరో ఓపెనర్ పావెల్ ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కూడా విండీస్ ఇన్నింగ్స్ ఎక్కడా కుదుటపడలేదు. వచ్చినవారు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. విండీస్ బ్యాట్స్ మెన్లలో బ్రాత్ వైట్ 2, పావెల్ 1, హోప్ 10, హెట్మర్ 10, అంబ్రిస్ 12, డౌరిచ్ 10 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఛేస్ 27, పాల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో షమీ 2, అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్ లు చెరో వికెట్ తీశారు. ఒకరు రనౌట్ అయ్యారు.