హోంమంత్రి చినరాజప్ప మరదలు కుక్కను ఉసిగొల్పి.. దళిత యువకుడి మరణానికి కారణమైంది!: బీఎస్పీ నేత ఆరోపణ
- వారం రోజులైనా పోలీసులు చర్యలు తీసుకోలేదు
- అండగా ఉన్నందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు
- రెండ్రోజుల్లో చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన
గత ఆగస్టు 28న దళిత విద్యార్థి ఎన్.వరుణ్ స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు అమలాపురంలోని హౌసింగ్ కాలనీకి వెళ్లాడని పట్టపు రవి తెలిపారు. ఆ సమయంలో చినరాజప్ప మరదలు పెంపుడు కుక్కను వరుణ్ పైకి ఉసిగొల్పిందన్నారు. దాని నుంచి తప్పించుకునే క్రమంలో వరుణ్ పక్కనే ఉన్న ఎర్రకాలువలోకి పడిపోయాడనీ, దీంతో ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. ఈ ఘటన జరిగి వారం రోజులు అయినా ఇప్పటివరకూ నిందితురాలిపై పోలీసులు కేసులు నమోదు చేయలేదన్నారు. చినరాజప్ప మరదలిని రెండ్రోజుల్లోగా అరెస్ట్ చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.