YSRCP: అవి.. తెలుగు తమ్ముళ్ల పాలిట 'చంద్రన్న కానుక'గా మారాయి!: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో బెల్టు షాపు కనిపిస్తే ఊరుకోమని, వాటి లైసెన్స్ లు రద్దు చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు ఏడాది క్రితం చేసిన ఆదేశాలు ఏమయ్యాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తూ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు.

‘బెల్టు షాపు కనిపించడానికి వీల్లేదు. కనిపిస్తే ప్రధాన షాపు లైసెన్స్‌ రద్దు చేయండి...అని హుంకరిస్తూ ఏడాది క్రితం చంద్రబాబు ఎక్సైజ్‌ శాఖ కార్యదర్శి, కమిషనర్‌ను ఆదేశించారు. మరి, ఈరోజు పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో రేషన్ షాపుల కంటే బెల్టు షాపుల సంఖ్య మూడింతలైంది! బెల్టు షాపులు తెలుగు తమ్ముళ్ళ పాలిట ‘చంద్రన్న కానుక’గా మారాయి. రేపు, మద్యం ఆదాయంలో ఏపీ నెంబర్ 1 అని బాబు సగర్వంగా ప్రకటించినా ఆశ్చర్యం లేదు! మహాత్మా! మమ్మల్ని మన్నించు!’ అని తన ఫేస్ బుక్ పోస్ట్ లో అన్నారు.

Go Back to Shorts
YSRCP
Telugudesam
Chandrababu
vijayasai reddy

More Telugu News