నన్ను టచ్ చేస్తే జీవితాంతం బాధపడతారు: డీఎంకేకు సీఎం విజయ్ వార్నింగ్
- తనను టచ్ చేయవద్దని డీఎంకేకు వార్నింగ్ ఇచ్చిన విజయ్
- జయలలితను స్టాలిన్ విమర్శించిన వీడియో ఇప్పటికీ వైరల్ అవుతోందన్న సీఎం
- అప్పుడు జయలలితకు, ఇప్పుడు టీవీకేకి డీఎంకేనే శత్రువు అని వ్యాఖ్య
జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార టీవీకే కూటమి, డీఎంకే పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు పార్టీల మధ్య ప్రతి రోజు మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా డీఎంకేకి విజయ్ మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తనను టచ్ చేయాలని చూడొద్దని, తనను టచ్ చేస్తే జీవితాంతం బాధ పడతారని ఆయన హెచ్చరించారు.
ఉప ఎన్నికల నేపథ్యంలో టీవీకే అభ్యర్థి కుమరవేల్ కు మద్దతుగా మధురాంతకంలో విజయ్ ప్రచారం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో విజయ్ మాట్లాడుతూ... జయలలితను స్టాలిన్ విమర్శించిన వీడియో ఇప్పటికీ వైరల్ అవుతోందని చెప్పారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆయన పార్టీలో ఉన్న పెద్ద నాయకులు కూడా ఇలాగే మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నారని విమర్శించారు. డీఎంకే నేతల వ్యాఖ్యలకు పరోక్షంగా పలువురు మద్దతిస్తున్నారని మండిపడ్డారు. ఆ పలువురు ఎవరో తెలుసు కదా? అని ప్రశ్నిస్తూ... ఆ పలువురు అన్నాడీఎంకే నేతలు అని అన్నారు.
స్టాలిన్ కు, డీఎంకేకు ఒకటే చెబుతున్నానని... అవినీతికి పాల్పడిన గుంపును వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గతంలో జయలలితకు డీఎంకేనే ప్రధాన శత్రువని, నేడు టీవీకేకు కూడా డీఎంకేనే శత్రువని అన్నారు. లోక్ సభలో నియోజకవర్గాల బిల్లు వస్తే మద్దతు ఇచ్చేందుకు డీఎంకే ఆత్రుతగా తహతహలాడుతోందని ఎద్దేవా చేశారు.