నాన్నగారిని అలా చూసి డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను: వెంకట్ అక్కినేని
- ఏఎన్నార్ గురించి ప్రస్తావించిన వెంకట్ అక్కినేని
- ఆలస్యంగా 'దేవదాసు' చూశానని వెల్లడి
- ఆ సినిమా చాలా బాధ కలిగించిందని వ్యాఖ్య
- 'మూగమనసులు'లో పారాణి సీన్ గురించిన వివరణ
అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా వెంకట్ అక్కినేని అందరికీ తెలుసు. అన్నపూర్ణ స్టూడియోస్ కి సంబంధించిన నిర్వహణలో ఆయన చాలా కీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటారు. ఆయన కెమెరా ముందుకు రావడం .. ఇంటర్వ్యూలు ఇవ్వడం చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి వెంకట్ అక్కినేని రీసెంటుగా 'తెలుగు వన్' తో మాట్లాడుతూ, అక్కినేని నాగేశ్వరరావు గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు.
'మూగమనసులు' సినిమా షూటింగు .. 'గోదావరీ' తీరంలో జరుగుతోంది. ఆదుర్తి సుబ్బారావుగారు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాకి సహాయకులుగా కె. విశ్వనాథ్ ఉన్నారు. జమున పాదం పై అక్కినేని పారాణి పెట్టే సీన్ ను ప్లాన్ చేశారు. ఆ సీన్ గురించి ఆదుర్తిగారు .. విశ్వనాథ్ గారు మాట్లాడుకుంటున్నారు. అయితే జామున పాదం పట్టుకుని పారాణి పెట్టే సీన్ చేయడానికి అక్కినేని ఒప్పుకుంటారో లేదో అనే ఒక టెన్షన్ వాళ్లలో ఉంది.
అంతలో అక్కినేని అక్కడికి వచ్చారు. సీన్ ఏమిటని ఆయన అడగ్గానే విశ్వనాథ్ గారు చెప్పారు. అప్పుడు అక్కినేని రియాక్షన్ ఎలా ఉంటుందా అని వాళ్లిద్దరూ వెయిట్ చేస్తున్నారు. నాన్నగారు మాత్రం .. ఏమీ ఆలోచన చేయకుండా అలాగే చేసేద్దాం అన్నారు. దాంతో వాళ్లిద్దరి మనసులు తేలికపడ్డాయి. అలా సినిమాకి ఒక సీన్ అవసరమనుకుంటే నాన్న ఎంత మాత్రం ఆలోచన చేసేవారు కాదు అని అన్నారు.
ఇక నేను ఫారిన్ లో చదువు పూర్తి చేసుకుని వచ్చాను. అన్నపూర్ణ స్టూడియోస్ లో మేనేజర్ గా వ్యవహారాలు చూడటం మొదలు పెట్టాను. అప్పుడు ఒక రోజున నాన్నగారు చేసిన 'దేవదాసు' సినిమా చూశాను. ఆ సినిమాలో నాన్నగారిని అలా చూసి రెండు మూడు రోజులు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. ఎందుకనో ఆయనను అలా చూడటం కష్టంగా అనిపించింది" అని చెప్పారు.