పాత పరుపు అనుకుంటే.. లోపల మహిళ శవం!
- బెంగళూరులో ఖాళీ ప్లాట్‌లో ఘటన
- పాత పరుపులా కనిపించిన వస్తువులో మహిళ మృతదేహం
- ఆర్థిక వివాదంతో భార్యను హత్య చేసిన భర్త
- మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి ప్లాట్‌లో పడేసిన వైనం
- 20 రోజుల తర్వాత వెలుగులోకి
- రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న జంట
ఖాళీ ప్రదేశంలో పడివున్న ఒక పాత పరుపును తరలించేందుకు ప్రయత్నించిన కార్మికులు, దానిలోంచి ఓ కాలు బయటకు రావడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసుల విచారణలో అది 28 ఏళ్ల అనుసూయ మృతదేహమని, ఆమెను భర్త సాగర్ చంద్ర రావత్ (32) హత్య చేసి పడేశాడని తేలింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.బెంగళూరులో జరిగిందీ ఘటన.
పోలీసుల కథనం ప్రకారం.. సెప్టెంబర్ 2న సంపిగేహళ్లి సమీపంలోని అగ్రహార లేఅవుట్‌లోని ఓ ఖాళీ సైట్‌లో కొందరు కార్మికులు శుభ్రం చేస్తున్నారు. అక్కడ పడి ఉన్న పాత పరుపు లాంటి వస్తువును పక్కకు జరుపుతుండగా, లోపల నుంచి ఒక కాలు కనిపించింది. వెంటనే వారు స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూడగా.. మృతదేహాన్ని ఒక బెడ్‌షీట్‌లో చుట్టి తాడుతో గట్టిగా కట్టివేసి ఉంది. హత్య జరిగి సుమారు 20 రోజులు అయి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
మృతురాలిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. అయితే, ఆమె దుస్తులపై ఉన్న ఒక ట్యాగ్ కీలక ఆధారాన్ని ఇచ్చింది. ఆ ట్యాగ్ సాయంతో దుస్తులు కొన్న షాపు వివరాలు తెలుసుకుని, బిల్లు ఆధారంగా మృతురాలు ఒడిశాకు చెందిన అనుసూయగా నిర్ధారించారు. అనంతరం ఆమె భర్త సాగర్ చంద్ర రావత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది.
ఒడిశాకు చెందిన అనుసూయ, సాగర్ ప్రేమించుకుని సుమారు రెండేళ్ల క్రితం కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చి వేర్వేరు హోటళ్లలో పనిచేస్తున్నారు. ఆగస్టు 11న జీతం, అడ్వాన్స్ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది ఇంట్లో కూడా కొనసాగడంతో, ఆగ్రహానికి గురైన సాగర్ ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. మూడు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి, ఆగస్టు 14 లేదా 16వ తేదీ రాత్రి బెడ్‌షీట్‌లో చుట్టి సమీపంలోని ఖాళీ ప్లాట్‌లో పడేశాడు. ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేసి హోటల్‌లోనే నివాసం ఉంటున్నాడు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.