ఆ రైలు ప్రయాణంలో నాలుగు గంటల పాటు మానసిక వేదన అనుభవించా: ఎంపీ తేజస్వి సూర్య భార్య
- ఇటీవల ఐదు గంటల పాటు రైల్లో ప్రయాణించానన్న తేజస్వి భార్య శివశ్రీ
- తన కోచ్ లో దాదాపు 40 మంది పెద్దగా మాట్లాడుతున్నారని వెల్లడి
- కొందరు యువతులను కామెంట్ చేస్తున్నారని మండిపాటు
సాధారణంగా రైలు ప్రయాణంలో ఎంతో మందికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి. దీనికి ప్రముఖులు కూడా మినహాయింపు కాదనే మరో ఘటన తాజాగా చోటుచేసుకుంది. రైలు ప్రయాణంలో తాను కూడా ఇబ్బంది పడ్డానని బెంగళూరు దక్షిణ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్య శివశ్రీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఇటీవల తాను రైల్లో దాదాపు ఐదు గంటల పాటు ప్రయాణించానని... ఆ ప్రయాణంలో నాలుగు గంటల పాటు మానసిక వేదనను అనుభవించానని శివశ్రీ చెప్పారు. సుమారు 56 మంది ఉన్న ఆ కోచ్ లో దాదాపు 40 మంది పెద్దగా మాట్లాడుతూనో... యువతులను, మహిళలను చూస్తూ కామెంట్ చేస్తూనో ఉన్నారని ఆమె తెలిపారు. తనకు వేరే బోగీలో కూర్చునేందుకు అవకాశమివ్వాలని కోరానని... అయితే, వేరే బోగీల్లో సీట్లు ఖాళీగా లేకపోవడంతో అదే బోగీలోనే కూర్చోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆ ప్రయాణం తనకు తీరని వేదనను మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.