ఆది! నువ్వు పుట్టకముందే పంచ్ లు వేసినవాడిని!: రాజేంద్రప్రసాద్
- ప్రేమకథా చిత్రంగా 'బేవర్స్'
- సంజోష్ జోడీగా హర్షిత
- కీలకమైన పాత్రలో రాజేంద్ర ప్రసాద్
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై రాజేంద్రప్రసాద్ సరదాగా మాట్లాడుతూ అందరినీ నవ్వించారు. వేదికపై హీరో పక్కనే నుంచున్న హీరోయిన్స్ ను పిలిచి తన పక్కన కూడా నుంచోవచ్చంటూ వాళ్లను ఆటపట్టించారు. వేదికపై వున్న ఆదిని ఉద్దేశించి .. కుళ్లుకోవద్దని అన్నారు. అందుకు ఆది ఏదో చెప్పబోతుంటే రాజేంద్రప్రసాద్ ఖండించారు. 'నీ కంటే ముందు నుంచి పంచ్ లు వేసినవాడినిరా బాబూ నేను' అన్నారు. ఆది అనేవాడు పుట్టక ముందు నుంచి అల్లరి చేస్తున్నవాడు రాజేంద్ర ప్రసాద్' అంటూ నవ్వేశారు.