shankar: శంకర్ నుంచి ఉత్కంఠను రేకెత్తించే భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

షార్ట్స్‌లో చూడండి
భారీ చిత్రాల దర్శకుడిగా శంకర్ కి విపరీతమైన క్రేజ్ వుంది. గ్రాఫిక్స్ కి ప్రాధాన్యతను ఇచ్చినా, బలమైన కథాకథనాలు ఉండేలా చూసుకోవడం ఆయన ప్రత్యేకత. అలాంటి శంకర్ ప్రస్తుతం '2.ఓ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నాల్లో వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా చకచకా జరిగిపోతూనే వున్నాయి.

ఇక ఈ సినిమా తరువాత ఆయన మరో భారీ ప్రాజెక్టును మొదలుపెట్టడానికి ఇప్పటి నుంచే రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో .. ఉత్కంఠను రేకెత్తించే విధంగా ఉంటుందని అన్నాడు. ఈ ప్రాజెక్టు కూడా వందలకోట్ల బడ్జెట్ లోనే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ సినిమాలో నాయకా నాయికలుగా ఎవరు నటించనున్నారనే విషయమే అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.  
Go Back to Shorts
shankar

More Telugu News